వెంకీ కుడుముల ఇంటర్వ్యూ

Tuesday,January 30,2018 - 10:03 by Z_CLU

నాగశౌర్య ‘ఛలో’ ఫిబ్రవరి 2 న గ్రాండ్ గా రిలీజవుతుంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే పాజిటివ టాక్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా వెంకీ కుడుముల మీడియాతో చేసిన చిట్ చాట్ మీకోసం…

నేను.. నా ఇంట్రడక్షన్…

నా పేరు వెంకీ కుడుముల. నాది ఖమ్మం జిల్లా అశ్వారావు పేట. నేను నా కరియర్ బిగినింగ్ లో తేజ గారి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్..’ సినిమాకి. ఆ తరవాత యోగి గారి దగ్గర ‘జాదూగాడు’, ‘తుఫాన్’ సినిమాలకు పని చేశాను. త్రివిక్రమ్ గారి దగ్గర ‘అ..ఆ..’ సినిమాకి కూడా పని చేశాను.

అప్పట్నించి బిగిన్ అయింది…

జాదూగాడు సినిమా చేస్తున్నప్పటి నుండే నాగశౌర్య కొంచెం క్లోజ్. అప్పుడే నేను శౌర్య చేయాలి అనుకోవడం, శౌర్య కూడా నా సినిమాలో చేయాలి అనుకున్నాడు…

అలా మొదలైంది…

ముందు ఏదైనా క్రైమ్ కామెడీ అనుకున్నా.. కానీ శౌర్య వద్దు అనగానే ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే, శౌర్య ని ఒరిజినల్ గా ఎందుకు ప్రెజెంట్ చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. నాగశౌర్య సినిమాల్లో చాలా సాఫ్ట్ గా కూల్ గా ఉంటాడు, కానీ రియల్ గా అలా ఉండడు… అలాగే ప్రెజెంట్ చేద్దాము అనుకున్నా అలా బిగిన్ అయింది.

వాళ్లిద్దరే ఇన్స్ పిరేషన్

సినిమాల్లోకి రావడానికి నాకు పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు ఇన్స్ పిరేషన్. వీళ్ళిద్దరి దగ్గర ఎలాగైనా పని చేయాలి అనుకునేవాణ్ణి. త్రివిక్రమ్ గారి దగ్గర చేయగలిగాను.

రుణపడి ఉంటాను….

శౌర్య కి నాపై బిగినింగ్ నుండి నమ్మకమే. స్టోరీ రెడీ చేసుకున్నాక బయట ప్రొడ్యూసర్ ని కలిస్తే స్టోరీ బావుంది కానీ, తక్కువ బడ్జెట్ లో చేయాలి అన్నారు. అప్పుడు శౌర్య పేరెంట్స్ ఇంత మంచి స్టోరీ, లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో చేసి, ప్రమోట్ సరిగ్గా చేయక ఎందుకు చెడగొట్టాలి, మనమే చేద్దామన్నారు. ఆ మాట విన్నప్పుడు షాకయ్యాను. నిజంగా వాళ్లకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను.

ప్లాన్ వేరు…

ఫస్ట్ సాంగ్ ప్లేస్ లో నిజానికి మాస్ సాంగ్ అనుకున్నాం. అప్పుడే ఆ అమ్మాయిని చూసిన ఫీల్ లో మాస్ సాంగ్ అనగానే మహతి ఎందుకో సింక్ అవ్వడం లేదు అన్నాడు. అలా డెసిషన్ చేంజ్ చేసుకుని కంప్లీట్ లవ్ సాంగ్ అని ఫిక్సయ్యాం…

ఫుల్ టూ ఎంటర్టైన్ మెంట్…

సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. దాని చుట్టూ బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది.

సినిమాలపై సెటైర్లు…

సినిమాలో… సినిమాలపై సెటైర్లు గట్రా ఏమీ ఉండవు, నాకు ఇష్టమైన సినిమాలన్నీ అలా పెట్టుకుంటాను అంతే… ఎక్కడా ఎవరి ఫీలింగ్స్ ని హర్ట్ చేసే ఎలిమెంట్స్ ఉండవు.

అప్పుడే అనుకున్నా…

జాదూగాడు సినిమా చేస్తున్నప్పుడే సాగర్ మహతి మ్యూజిక్ కంపోజిషన్ పద్ధతి నచ్చింది. సినిమా చేస్తే అందరం కలిసి చేద్దాం అని అప్పుడే ఫిక్సయ్యా…. దానికి తోడు శౌర్య కూడా  సాగర్ నే ప్రిఫర్ చేశాడు. రీసెంట్ గా సాగర్ కుమారి 21 F అనే సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. వింటే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇంకో ఆలోచన లేదు ఫిక్సయిపోయాం.

త్రివిక్రమ్ ప్రభావం….

ఇప్పుడు వచ్చే ప్రతి యంగ్ రైటర్ కి త్రివిక్రమ్ గారే  ఇన్స్ పిరేషన్ . నాక్కూడా అంతే. కాకపోతే ఆయన్ని ఎక్కడా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయలేదు.

అందుకే తమిళ ఆర్టిస్ట్….

ఆంధ్రా, తమిళనాడు బార్డర్ అనగానే సిచ్యువేషన్ ని తమిళ ఆర్టిస్ట్ లు అయితేనే బెటర్ అనుకుని వాళ్ళనే ప్రిఫర్ చేశాం. అక్కడ మన వాళ్ళను పెడితే, ఆ ఫీల్ మిస్ అయి ఉండేది.