మోస్ట్ ఫేవరేట్ డైరెక్టర్ లా మారిన వెంకీ కుడుముల

Wednesday,May 30,2018 - 12:02 by Z_CLU

ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హీరో అనిపించుకున్నాడు వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ దర్శకుడు, నితిన్ తో నెక్స్ట్ సినిమాని లైనప్ చేసుకున్నాడు. అయితే నితిన్ ప్రస్తుతం ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో బిజీగా ఉండేసరికి, ఈ గ్యాప్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమాను సెట్ చేసుకున్నాడు వెంకీ కుడుముల.

నితిన్ ఇలా ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకి ప్యాకప్ చెప్తాడో లేదో, నితిన్ సినిమాని సెట్స్ పైకి రానున్న వెంకీ కుడుముల, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమాకి రెడీ అవుతాడు. అయితే మూవీ సెట్స్ పైకి కూడా రాకముందే నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్న ఈ దర్శకుడు ఈ సినిమా కోసం ఏ హీరోను అప్రోచ్ కానున్నాడోనన్న ఆలోచన అప్పుడే ఫిల్మ్ నగర్ బిగిన్ అయిపోయింది.

ఫస్ట్ సినిమాతో అటు మాస్, ఇటు క్లాస్ ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేసిన వెంకీ కుడుముల, తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో అటు స్టార్స్ తో పాటు ప్రొడ్యూసర్స్ ని ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు. జస్ట్ ఒక్క సినిమా తోనే ప్రొడ్యూసర్స్ కి మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్ మేకర్ లా మారిపోయాడు వెంకీ కుడుముల.