ఆ హీరోలా మారబోతున్న వెంకీ

Sunday,September 11,2016 - 09:00 by Z_CLU

బాబు బంగారం తో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ తదుపరి సినిమాకు సిద్దమవుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే  ‘సాలా ఖదూస్’ అనే ఓ బాలీవుడ్ సినిమా ను ఎంచుకున్నాడు. బాలీవుడ్ లో గ్రాండ్ హిట్ సాధించిన ఈ సినిమాను తెలుగు లో రీమేక్ చేసి మరో రీమేక్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు వెంకీ.  బాలీవుడ్ లో మాధవన్, రితిక సింగ్ లతో రూపొందిన ఈ చిత్రం గురు శిష్యుల కధాంశం కావడం తో తెలుగు లో ఈ సినిమాకు  ‘గురు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో కోచ్ గా కనిపించేందుకు వెంకీ సిద్దమవుతున్నాడు ఇప్పటికే తన ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్న దగ్గుబాటి హీరో…. దీనికోసం ఓ కోచ్ సహకారంతో ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు కసరత్తులు చేస్తున్నాడట. త్వరలోనే ప్రారంభంకానున్న ఈ సినిమాలో కోచ్ గా సరికొత్తగా కనిపించబోతున్నాడు వెంకీ.