'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' లో వెంకీ..

Friday,March 31,2017 - 09:00 by Z_CLU

లేటెస్ట్ గా ‘ఖైదీ నంబర్ 150 ‘ సినిమాతో రి ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరు నెక్స్ట్ సినిమాకు సంబంధించి స్వతంత్ర సమయోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ కథను ఫైనల్ చేసుకొని అదే టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే.

త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో వెంకటేష్ కచ్చితంగా ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తాడట. లేటెస్ట్ గా ఓ షోలో జరిగిన సంభాషణలో ఈ విషయాన్నీ తెలిపాడు వెంకీ. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ “చిరు రి ఎంట్రీ ఇచ్చిన 150 లో ఓ నేను సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ గెస్ట్ రోల్స్ చేయాలనుకున్నామని అయితే అప్పుడు అది కుదరలేదని, కానీ చిరు నెక్స్ట్ సినిమాలో చిరుతో కలిసి కచ్చితంగా నటిస్తానని” చెప్పాడు. అంటే ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ సినిమాలో వెంకీ ఓ గెస్ట్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉందన్నమాట…