కొత్త సినిమా పై వెంకీ ఫోకస్

Sunday,December 18,2016 - 11:00 by Z_CLU

విక్టరీ వెంకటేష్ ‘గురు’ తో రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘సాలా ఖదూస్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో ఫినిష్ చేశాడు వెంకటేష్. అసలు సెట్స్ పై ఎప్పుడు పెట్టాడా? అనే లోపే సినిమా కూడా ఫినిష్ చేసి అందర్నీ షాక్ చేశాడు విక్టరీ. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండడంతో నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టాడట బొబ్బిలి రాజా.

ప్రెజెంట్ ‘గురు’ స్పీడ్ తోనే నెక్స్ట్ సినిమాను ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో నటించే సినిమా ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ షూటింగ్ జనవరి ఎండింగ్ లో గాని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేసి ఆ సినిమాను కూడా రికార్డు టైంలో పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట వెంకీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాలో ఇప్పటికే తేజస్వి, నిత్యామీనన్ లను హీరోయిన్లుగా తీసుకున్న విషయం తెలిసిందే.