ఏకథాటిగా పని ముగించిన వెంకీ

Sunday,November 20,2016 - 12:35 by Z_CLU

ఒక సినిమాక కమిట్ అయ్యాడంటే ఇక మిగతా పనులేమీ పెట్టుకోడు విక్టరీ వెంకటేశ్. పరిశ్రమకొచ్చి పాతికేళ్లు దాటినా విక్టరీలో ఇంకా అదే డెడికేషన్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గురు సినిమా. అవును.. నిన్నగాకమొన్న ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ను అప్పుడే క్లయిమాక్స్ కు తీసుకొచ్చాడు వెంకీ. మేజర్ టాకీ పార్ట్ వైజాగ్ లో షూటింగ్ జరుపుకోగా… తాజాగా ఆ పార్ట్ కూడా ఫినిష్ చేశారు. త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. సాలా ఖదూస్ అనే సినిమాకు రీమేక్ గా గురు వస్తోంది. ఇందులో వెంకీ బాక్సింగ్ కోచ్ గా కనిపించబోతున్నాడు. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన సుధ కొంగర… ఈ రీమేక్ ను కూడా హ్యాండిల్ చేస్తోంది. అలాగే ఒరిజినల్ వెర్షన్ లో బాక్సర్ గా నటించిన రితికా సింగ్.. ఇందులో కూడా అదే పాత్ర పోషిస్తోంది. కాకపోతే.. ఒరిజినల్ వెర్షన్ లో మాధవన్ నటిస్తే.. రీమేక్ లో అ స్థానాన్ని వెంకీ భర్తీ చేస్తున్నాడు. ఈనెలాఖరుకు సినిమా షూటింగ్ పూర్తిచేసి, వచ్చేనెల నుంచి ప్రచారాన్ని చేపట్టాలని అనుకుంటున్నారు. కుదిరితే సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో కూడా వెంకీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు.