వెంకటేష్-చైతూ కాంబినేషన్ - అంతా రెడీ

Sunday,July 08,2018 - 04:15 by Z_CLU

ప్రస్తుతం వెంకటేష్ -వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ‘F2’సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే… ఈ కాంబినేషన్ తో పాటు వెంకీ -చైతూ కాంబినేషన్ కూడా ఫాన్స్ ను ఎప్పటి నుండో ఊరిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను ఈ నెల 11 న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ మల్టీ స్టారర్ ను  గ్రాండ్ గా నిర్మించనున్నట్లు అనౌన్స్ చేసిన సురేష్ బాబు మరో రెండు మూడు రోజుల్లో అఫీషియల్ గా ప్రకటించనున్నాడని సమాచారం.

ఇటివలే ‘ప్రేమమ్’ సినిమాలో మావయ్య క్యారెక్టర్ లో చైతూ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్ ఈ సినిమాలో కూడా చైతూ  మామ గానే కనిపించనున్నాడని తెలుస్తుంది. మామా అల్లుళ్ళ కథతో బాబీ డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు ‘వెంకీ మామ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్. సో  త్వరలోనే ఈ మల్టీ స్టారర్ సినిమా సెట్స్ పైకి రానుంది.