నారప్ప షూటింగ్ అప్ డేట్స్

Wednesday,February 19,2020 - 06:30 by Z_CLU

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 10 రోజులు పాటు తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో 12,000 ఎకరాల్లో ఉండే తెరికాడులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. అక్కడ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసారు యూనిట్.

ఇప్పటికే 27 రోజుల పాటు షూట్ చేసిన యూనిట్ సినిమాను ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలోనే టోటల్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.