'నారప్ప' షూటింగ్ అప్ డేట్స్ !

Tuesday,February 04,2020 - 10:02 by Z_CLU

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘నారప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటివలే అనంతపురంలోని ఉరవకొండ లో ఓ షెడ్యుల్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం తమిళ్ నాడులోని కురుమలైలో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. పీటర్ హైన్స్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ను కంపోజ్ చేస్తున్నాడు.

తమిళనాడులో యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తవ్వగానే యూనిట్ అనంతరపురం వెళ్లనుంది. అక్కడ ఓ లాంగ్ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. సురేష్ బాబు , కలైపులి థాను కంబైన్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లేదా మే లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.