Venkatesh Narappa - ఇక ప్రమోషన్ షురూ

Saturday,July 10,2021 - 07:44 by Z_CLU

నారప్ప సినిమాకు సంబంధించి స్ట్రయిట్ ఓటీటీ రిలీజ్ ప్లాన్ కాన్సిల్ అయింది. సినిమా ముందుగా థియేటర్లలోనే వస్తుంది. ఆ తర్వాతే ఓటీటీకి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో నారప్ప ప్రమోషన్ స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. రేపట్నుంచి ఈ సినిమా అఫీషియల్ ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది.

విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

narappa venkatesh
విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది.

ఈ చిత్రం నుండి చలాకి చిన్నమ్మీ.. ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రేపు (జూలై11) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న మణిశర్మ పుట్టినరోజు కూడా రేపు. అతడి బర్త్ డే కానుకగా, అతడు కంపోజ్ చేసిన సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారని అనుకోవచ్చు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics