సెట్స్ పైకి వచ్చిన 'వెంకీ మామ'

Sunday,February 24,2019 - 11:04 by Z_CLU

విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘వెంకీ మామ’ ఈరోజే సెట్స్ పైకొచ్చింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈరోజు నుండి 20 రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు యూనిట్. బాబీ డైరెక్షన్ లో విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ‘రంగస్థలం’ ఫేం రామ కృష్ణ,మోనికా లు ఆర్ట్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.