రెండు మల్టీ స్టారర్ సినిమాలతో వెంకీ

Sunday,March 25,2018 - 03:00 by Z_CLU

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తేజ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు వెంకీ. ఈ సినిమా తర్వాత అనిల్ రావి పూడి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ తో కలిసి నటించబోతున్న  ఈ దగ్గుబాటి హీరో మరో మల్టీ స్టారర్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తుంది. బాబీ డైరెక్షన్ లో అల్లుడు అక్కినేని చైతుతో కలిసి వెంకీ ఓ సినిమా చేయబోతున్నాడట.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. వెంకీ-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘F2’ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, చైతూ తో వెంకీ నటించబోయే ఫ్యామిలీ ఎంటర్ టైనర్  సినిమాను పీపుల్స్ మీడియా సంస్థ తో కలిసి సురేష్ బాబు నిర్మించనున్నాడని తెలుస్తుంది. మరి ఈ మల్టీ స్టారర్ సినిమాలతో వెంకీ ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేస్తాడో..చూడాలి.