నా దగ్గరికి రాలేదు..

Sunday,April 02,2017 - 10:00 by Z_CLU

విక్టరీ వెంకటేష్ లో ఎమోషన్ తో పాటు మంచి కామెడీ టైమింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేసి కొన్ని సూపర్ హిట్స్ కూడా అందుకున్న వెంకీ లేటెస్ట్ గా ఓ కామెడీ సబ్జెక్ట్ సినిమా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు విక్టరీ ఫాన్స్. ఆ కథ మరేదో కాదు అందరికి తెలిసిన చదివిన పదవతరగతి పాఠ్యంశం లోని ‘బారిస్టర్ పార్వతీశం’ కథ..

పార్వతీశం క్యారెక్టర్ తో వెంకీ ఆ సినిమా చేస్తే బాగుంటుందని అప్పట్లో సోషల్ మీడియాలో రానా కి కూడా తెలిపారు ఫాన్స్. అయితే ఆ కథ గురించి బాబాయ్ కి కచ్చితంగా చెప్తానంటూ అప్పట్లో రానా ఫాన్స్ కి రిప్లై కూడా ఇచ్చాడు.

ఇక ఈ విషయాన్నీ లేటెస్ట్ గా వెంకీ ముందు పెట్టగా “ఇలాంటి కథ ఒకటి ఉందని నాకు తెలియదే.. ఇప్పటి వరకూ ఈ విషయం నాదగ్గరికి రాలేదే ఇక ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుంటా నచ్చితే కచ్చితంగా చేస్తా అని తెలిపాడు”. సో ఎట్టకేలకి ఫాన్స్ కోరిక వెంకీ కి తెలిసిందన్నమాట. మరి వెంకీ ఆ సినిమా చేస్తే చూద్దామనుకుంటున్న ఫాన్స్ కోరిక ఇక పై అయినా తీరుతుందో లేదో చూడాలి…