ఇది ‘వెంకీమామ’ తో ఆగేలా లేదు...

Friday,December 13,2019 - 11:59 by Z_CLU

మామా అల్లుళ్ళ కాంబినేషన్ అనేది పక్కన పెడితే ‘F2’ తరవాత వెంకీ ఇమ్మీడియట్ గా చేసిన మల్టీస్టారర్ ‘వెంకీమామ’. అయితే వెంకీ ఈ మల్టీస్టారర్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడనిపిస్తుంది. ‘ఇండస్ట్రీకి వచ్చి 30 ఇయర్స్ దాటాయి. ఇంకా అచీవ్ చేయడానికి స్పెషల్ గా ఏమీ లేద’ని చెప్పుకున్న వెంకీ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ అందరితో మల్టీస్టారర్ చేయాలనుందని మనసులో మాట చెప్పుకున్నాడు.

రీసెంట్ గా ‘వెంకీమామ’ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన వెంకీ.. తనతో చిన్న వాళ్ళందరితో సినిమా చేయాలనుందని చెప్పుకున్నాడు. మరీ ముఖ్యంగా జూనియర్ NTR తో కూడా. మొన్నా మధ్య నానితో చేయాలనుకున్నా కుదరలేదని, మంచి కథ దొరకాలి కానీ ఎనీ టైమ్ మల్టీస్టారర్ కి రెడీ అని చెప్పుకున్నాడు వెంకీ.

కథ సరిగ్గా పడాలి కానీ జూనియర్ NTR కూడా మల్టీస్టారర్ కి దూరం కాదు RRR వల్ల క్లియరయింది. నాని కూడా వెంకీ టైపే… గట్టిగా ఫిక్సవ్వాలి కానీ కథ వెదుక్కుని మరీ సినిమా సెట్స్ పైకి తీసుకొచ్చేదాకా ఊరుకోడు.ఈ లెక్కన వెంకీ మల్టీస్టారర్స్ సినిమాల వరస ‘వెంకీమామ’ తో ఆగదనిపిస్తుంది. ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి.