రీమేక్ ఫిక్స్.. డైరక్టర్ కోసం వెయిటింగ్

Friday,November 08,2019 - 02:08 by Z_CLU

తెలుగులో అత్యథిక రీమేక్స్ చేసిన హీరోగా వెంకీకి ఇమేజ్ ఉంది. ఇప్పుడీ హీరో మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ప్రాజెక్టు అయితే లాక్ అయింది, డైరక్టర్ ఎవరనేది తేలడం లేదు. ఒరిజినల్ వెర్షన్ తీసిన వెట్రిమారన్, రీమేక్స్ చేయడనే విషయం తెలిసిందే.

అందుకే ఓ మంచి తెలుగు డైరక్టర్ కోసం వెదుకుతోంది సురేష్ ప్రొడక్షన్ టీం. ఇందులో భాగంగా ఈమధ్యే కొంతమంది దర్శకులకు ఈ సినిమాను రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా చూపించారు. ఎవరైతే ముందుకొస్తారో వాళ్లతో ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో ఈ సినిమాను దాదాపు 20 మంది దర్శకులు చూసినట్టు టాక్.

అనుకున్న టైమ్ లో డైరక్టర్ ఎవరైనా ముందుకొస్తే, వాళ్లతో అసురన్ రీమేక్ స్టార్ట్ చేస్తాడు వెంకీ. ఒకవేళ గడువు లోగా ఎవ్వరూ ముందుకురాకపోతే.. తరుణ్ భాస్కర్ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు