Mosagallu - సీనియర్ హీరో వాయిస్ ఓవర్

Friday,October 16,2020 - 03:17 by Z_CLU

Manchu Vishnu హీరోగా Jeffrey Gee Chin దర్శకత్వంలో తెరకెక్కుతున్న Mosagallu టీజర్ ను ఇటివలే స్టైలిష్ స్టార్ Allu Arjun రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా మరో సీనియర్ స్టార్ హీరో సపోర్ట్ కూడా అందుకుంది. విక్టరీ Venkatesh ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడు. తాజాగా వెంకీ వాయిస్ చెప్తున్న ఓ ఫోటో ను షేర్ చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేసారు.

USA జరిగిన అతిపెద్ద స్కాప్ నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో Kajal Aggarwal, విష్ణుకు చెల్లెలి పాత్రలో కీలక పాత్రలో కనిపించనుంది. AVA Entertainment and 24 Frames Factory బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు Sam C.S మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.