F3 Movie ఫుల్ రన్ కలెక్షన్స్

Tuesday,July 05,2022 - 03:18 by Z_CLU

Venkatesh, Varun Tej’s F3 Worldwide Full Run Collections

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘F3’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. రిలీజ్ రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా నలబై రోజులు పూర్తి చేసుకొని యాబై రోజుల వైపు దిగ్విజయంగా వెళ్తున్న ఈ సినిమా ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 134 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక్క నైజాంలోనే 20 కోట్లు కలెక్ట్ చేసింది.

వెంకటేష్ , వరుణ్ లతో అనిల్ రావిపూడి క్రియేట్ చేసిన ఈ ఫన్ ఫ్రాంచైజీ తెలుగు ప్రేక్షకులను హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసి ఫుల్ రన్ లో మంచి వసూళ్ళు అందుకుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 70 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ఆంద్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో 53.94 కోట్ల షేర్ రాబట్టి వెంకటేష్ , వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక యాబై రోజుల తర్వాతే OTTరిలీజ్ ఉంటుందని ముందే చెప్పిన మేకర్స్ చెప్పిన మాట ప్రకారం 50 తర్వాతే OTT లో రిలీజ్ చేస్తున్నారు.

F3 ఏరియా వైస్ కలెక్షన్ డీటెయిల్స్ 

నైజాం – 20.57cr
ఉత్తరాంద్ర  – 7.48cr
ఈస్ట్ – 4.18cr
వెస్ట్ – 3.41cr
కృష్ణా – 3.23cr
గుంటూరు- 4.18cr
నెల్లూరు- 2.31cr
సీడెడ్- 8.58cr
కర్ణాటక- 5Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా – 2Cr
ఓవర్సీస్ – 10Cr

 

AP/TS షేర్ – 53.94Cr(Incl. GST)
వరల్డ్ వైడ్ షేర్ – 70.94Cr
వరల్డ్ వైడ్ గ్రాస్ – 134Cr

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics