వెంకీ, వరుణ్ ల ‘F2’ ఫస్ట్ లుక్ పోస్టర్

Monday,November 05,2018 - 04:21 by Z_CLU

వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ‘F2’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయింది. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ పై ‘వస్తున్నారు సంక్రాంతి అల్లుళ్ళు’ అని కూడా మెన్షన్ చేశారు ఫిల్మ్ మేకర్స్. వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు తమన్నా, మెహరీన్ లు హంగామా మూడ్ లో ఉన్న ఈ పోస్టర్, ఈ సినిమా చుట్టూ మరిన్ని పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తుంది.

రీసెంట్ గా బ్యాంకాక్ లో 2 భారీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ లో సాంగ్స్ తో పాటు, మ్యాగ్జిమం టాకీపార్ట్ ని తెరకెక్కించిన ఫిల్మ్ మేకర్స్, ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ ప్రిపరేషన్స్ లో ఉన్నారు. మ్యాగ్జిమం డిసెంబర్ కల్లా బ్యాలన్స్ ఉన్న 3 పాటలతో పాటు క్లైమాక్స్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్న మేకర్స్ ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్స్  గా నటిస్తున్న విషయం తెలిసిందే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  దిల్ రాజు  ఈ సినిమాని  నిర్మిస్తున్నాడు. అనిల్ రావిపూడి  డైరెక్టర్.