ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మల్టీస్టారర్

Friday,July 20,2018 - 11:52 by Z_CLU

వెంకీ, వరుణ్ తేజ్ ల F2 సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ లో వెంకీ, వరుణ్ తేజ్ తో పాటు వీరిద్దరి సరసన హీరోయిన్స్ గా నటిస్తున్న తమన్నా, మెహరీన్ కౌర్ కాంబినేషన్ లో సినిమాలోని హిలేరియస్ సీక్వెన్సెస్ ని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించారు ఫిల్మ్ మేకర్స్. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేశాడు.

మోస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎగ్జాక్ట్ థీమ్ అనేది ఇంకా రివీల్ కాలేదు కానీ కంప్లీట్ గా ఫ్రెష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ పై నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు ఫిల్మ్ మేకర్స్ సెట్స్ పై జరుగుతున్న హంగామాని ఎప్పటికపుడు అప్ డేట్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది.

 

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ బిగిన్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్ కరెక్ట్ టైమ్ చూసుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.