'అలాద్దీన్' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన వెంకీ, వరుణ్ తేజ్

Saturday,May 11,2019 - 05:40 by Z_CLU

అమెరికా అగ్ర నిర్మాణ సంస్థ  వాల్ట్ డిస్నీ నిర్మాణంలో గాయ్‌ రిట్చయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అమెరికన్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘ అలాద్దీన్’. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను  ప్రముఖ హీరో వెంకటేష్, వరుణ్ తేజ్  విడుదల చేశారు.

ఇందులో జీనీగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ కనిపించనున్నాడు. ఇక అలాద్దీన్ గా  మేనా మసూద్‌ నటిస్తుండగా, ప్రిన్స్‌ జాస్మిన్‌గా నయోమి స్కాట్‌ అలరించనుంది. జీనికి తెలుగులో టాలీవుడ్‌ అగ్ర హీరో వెంకటేష్‌  వాయిస్ ఓవర్ ఇవ్వగా  అల్లాదిన్‌కు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఈ సినిమా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.