మరో రీమేక్ తో వెంకీ ....

Sunday,June 09,2019 - 12:02 by Z_CLU

టాలీవుడ్ లో రీమేక్ రాజాగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ మరో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నాడు. మొన్నీ మధ్యే విడుదలైన ‘దే దే ప్యార్ దే’ సినిమా అనే హిందీ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు వెంకీ. అజయ్ దేవగన్ , టబు, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే తెలుగులో కొన్ని మార్పులతో ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నాం అంటూ ఇటివలే మీడియాతో చెప్పుకొచ్చాడు సురేష్ బాబు.

ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చైతన్య తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్న వెంకటేష్ నెక్స్ట్ త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తో కూడా ఓ సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాతే వెంకీ రీమేక్ సినిమాను సెట్స్ పై పెట్టే ఛాన్స్ ఉంది. మరి ఈ రీమేక్ సినిమా భాద్యతను సురేష్ బాబు ఏ డైరెక్టర్ కి అప్పగిస్తారో..చూడాలి.