ఫిబ్రవరి నుంచి వెంకీ-తేజ సినిమా

Monday,January 08,2018 - 06:32 by Z_CLU

వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో కొత్త సినిమా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ఉంటుంది. ఈ విషయాన్ని తేజ అఫీషియల్ గా ప్రకటించాడు. వెంకీతో సినిమా ఫిబ్రవరి నుంచి మొదలుపెడతామని, హీరోయితో పాటు మిగతా నటీనటుల వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించాడు.

నిజానికి తేజ దర్శకత్వంలో వెంకీ సినిమా ఈ వారంలోనే ప్రారంభమౌతుందని అంతా అనుకున్నారు. కానీ సడెన్ గా ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ షూటింగ్ ఉండడంతో.. వెంకీ సినిమా కాస్త ఆలస్యమైంది. దీనికి తోడు హీరోయిన్ ఎంపిక కూడా లేట్ అవ్వడంతో వచ్చేనెల నుంచి సినిమా ప్రారంభించాలని నిర్ణయించారు.

 

సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తాడు. ఆట నాదే, వేట నాదే అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.