ఈ నెల 26 నుండి వెంకటేష్ కొత్త సినిమా

Monday,March 12,2018 - 06:03 by Z_CLU

ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసింది వెంకటేష్ – తేజ సినిమా. రీసెంట్ గా రిలీజైన వెంకీ ఫస్ట్ లుక్ కూడా ఇంప్రెసివ్ అనిపించుకుంది. నారా రోహిత్ కీ రోల్ ప్లే చేయనున్న ఈ సినిమాలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాని మార్చి 26 న లేదా ఏప్రియల్ 1 న సెట్స్ పైకి తీసుకురానున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ షెడ్యూల్ లో వెంకటేష్, నారా రోహిత్, శ్రియ శరణ్ కాంబినేషన్ లో ఉండబోయే కీలక సన్నివేశాలను తెరకెక్కించనుంది తేజ టీమ్.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకటేష్ ప్రొఫసర్ గా కనిపించనున్నాడు. తేజ మార్క్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈషా రెబ్బ  ఈ సినిమాలో  ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేయనుంది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని D. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా సురేష్ ప్రొడక్షన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.