F3 Movie - తనకు ఇంపార్టెంట్ అంటున్న వెంకీ

Sunday,May 22,2022 - 11:47 by Z_CLU

ఎఫ్3 మూవీ ‘ఫన్’టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మూడేళ్ళ తర్వాత ఎఫ్ 3 రూపంలో నా సినిమా మే 27 థియేటర్ లోకి వస్తుంది. అంతకుముందు చేసిన నారప్ప, దృశ్యం ఓటీటీలో విడుదలయ్యాయి. మళ్ళీ ఎఫ్ 3లో మీ అందరినీ థియేటర్ లో కలవడం చాలా ఆనందంగా వుంది. ఎఫ్ 3ని ప్రేక్షకులంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతమైన స్క్రిప్ట్ చేశారు. దిల్ రాజు గారితో పని చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు, టెక్నిషియన్ల అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నటించిన సినియర్ నటులు అన్నపూర్ణమ్మ గారు, విజయ గారు నాపై ఎంతో ప్రేమతో మద్రాస్ నుండి భోజనం తీసుకొచ్చేవారు. వారు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ ఈవెంట్ సూపర్, ఎక్స్ ట్రార్డినరీ, అదిరిపోయింది. ఎఫ్ 3 కూడా అదిరిపోతుంది. మీరంతా థియేటర్ లో సినిమా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను”