రెండు సినిమాలతో సిద్దమవుతున్నాడు

Monday,August 08,2016 - 03:41 by Z_CLU

ప్రస్తుతం ‘బాబు బంగారం’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న వెంకటేశ్ తన తదుపరి చిత్రాలకు సంబంధించిన విషయాలు ఇటీవలే తెలియజేసారు. వెంకీ ఒక్క సినిమా తో కాదు రెండు సినిమాలతో ఈ ఏడాది హల్ చల్ చేయబోతున్నాడు. వీటిలో కిషోెర్ తిరుమల దర్శకత్వంలో ఒకటి కాగా మరొకటి సుధా కొంగర దర్శకత్వం లో ‘సలా ఖాదూస్’ రీమేక్. నేను శైలజ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల తో చేయబోయే సినిమాకు ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే టైటిల్ కు ఫిక్స్ చేశారట యూనిట్. రామ్ మోహన్ రావు నిర్మాణంలో… అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. సినిమాలో ఒక మెయిన్ హీరోయిన్ తో పాటు… మరో ఐదుగురు హీరోయిన్లు కూడా నటించనున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకురానున్నాయి.