Aranya - రానా చాలా ఎదిగాడంటున్న వెంకీ

Monday,March 22,2021 - 12:55 by Z_CLU

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ముఖ్య అతిథిగా హాజ‌రైన విక్ట‌రి వెంక‌టేష్ అర‌ణ్య మూవీ స్పెష‌ల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు శేఖ‌ర్ క‌మ్ముల‌, రానా ద‌గ్గుబాటి, విష్ణు విశాల్‌, హీరోయిన్ జోయా హుస్సేన్‌, మాట‌ల ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకీ.. రానా నటుడిగా చాలా ఎదిగాడని మెచ్చుకున్నాడు.

“తన జర్నీలో యాక్టర్‌గా నేర్చుకుంటున్నాడు అనుకున్నాను. కానీ అరణ్య సినిమాలోని పాత్రలో రానా ఒదిగిపోయిన తీరు చూస్తుంటే …యాక్టర్‌గా రానా చాలా ఎదిగాడని అనిపిస్తుంది. అరణ్య సినిమాలోని ఫస్ట్‌ ప్రేమ్‌ నుంచే రానా పెర్ఫార్మెన్స్‌ చూసి నేను స్టన్‌ అయ్యాను. ఇండియన్‌ స్క్రీన్‌పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్న రానాను అభినందిస్తున్నాను. రానా బాడీ లాంగ్వేజ్‌ పాత్రకు సరిగ్గా సరిపోయింది.”