Virataparvam PreRelease Event గెస్టులు వీళ్ళే !
Tuesday,June 14,2022 - 02:45 by Z_CLU
Venkatesh, Ram Charan and Sukumar will be the chief guest for Virataparvam Prerelease Event
రానా , సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాటపర్వం’ జూన్ 17న గ్రాండ్ గా రిలీజవుతుంది. గత కొన్ని రోజులుగా సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తూ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రానా , సాయి పల్లవి. మరో మూడు రోజుల్లో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించి రేపు శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ మేరకూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో రేపు ఈవెంట్ లో రామ్ చరణ్ స్పీచ్ ఎలా ఉంటుందో ? వెంకీ , చరణ్ , సుకుమార్ లు ఈ సినిమా గురించి ఏం చెప్పనున్నారో అనేది ఆసక్తిగా మారింది.
తాజాగా సుకుమార్ , త్రివిక్రమ్ కలిసి ‘విరాపర్వం’ ప్రీమియర్ షో చూసి రానా అండ్ టీంను అభినందించారని సమాచారం. సినిమా చూసిన సుకుమార్ ప్రేక్షకులకు ‘విరాటపర్వం’ ఎలా ఉండబోతుందో తన స్పీచ్ తో ఈవెంట్ లో చెప్పనున్నారు. రేపు ఈవెంట్ లో వెంకీ , చరణ్ , సుక్కు ఒకే వేదికపై కనిపిస్తూ సందడి చేయనున్నారు.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics
-
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics