వెంకీ ప్లానేంటి ?

Saturday,January 21,2017 - 06:49 by Z_CLU

ఇటీవలే తన లేటెస్ట్ సినిమా ‘గురు’ షూటింగ్ ఫినిష్ చేసిన విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు? అనే వార్త ప్రెజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకూ ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం లో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన వెంకీ లేటెస్ట్ గా పూరి జగన్నాథ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకూ సినిమా రాకపోవడం తో ఒక్క సారి గా  ఈ కాంబో పై అందరి దృష్టి  పడింది .

ఇక ఇప్పటి వరకూ నెక్స్ట్ సినిమా పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం తో అసలు వెంకీ ప్లాన్ ఏంటి? ఈ ఇద్దరి దర్శకుల్లో వెంకీ ఎవరితో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు? అనే క్వశ్చన్ అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ లో కూడా చర్చనీయాంశం అవుతుంది… మరి తన నెక్స్ట్ సినిమా పై వెంకీ క్లారిటీ ఇచ్చేదెప్పుడో?