వెంకటేష్ నెక్స్ట్ సినిమా అప్ డేట్స్

Wednesday,October 24,2018 - 12:40 by Z_CLU

ప్రస్తుతం ‘F2’ సినిమాతో సెట్స్ పై ఉన్నాడు విక్టరీ వెంకటేష్… ఈ సినిమాతో సంక్రాంతి సీజన్ లో సందడి చేయబోతున్న వెంకీ నెక్స్ట్ సినిమాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు. త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ కోసం రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ లేదా జనవరి నుండి సెట్స్ పైకి రానుంది.

వెంకటేష్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించనున్న ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ఓ హీరోని ఫైనలైజ్ చేసేపనిలో ఉన్నారు మేకర్స్. సురేష్ ప్రొడక్షన్, పీపుల్ మీడియా ఫాక్టరీ బ్యానర్స్ పై సురేష్ బాబు, భరత్ చౌదరి, కిరణ్  సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.