వెంకటేష్ నెక్స్ట్ సినిమా డీటేల్స్

Tuesday,May 16,2017 - 06:32 by Z_CLU

గురు సినిమా తరవాత తన నెక్స్ట్ సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు వెంకటేష్. ఫన్ లోడెడ్ కాన్సెప్ట్స్ తో పాటు కంటెంట్ కాస్త డిఫెరెంట్ గా ఉందనిపిస్తే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న వెంకీ తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ని ఆల్ రెడీ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

రీసెంట్ గా ‘కనుపాప’ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రియదర్శన్ తో వెంకీ డిస్కషన్ జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ డిస్కషన్స్ ఏ స్టేజ్ కి వచ్చాయో ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ, వీలైనంత తొందరగా నెక్స్ట్ సినిమాతో సెట్స్ పైకి రావాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది.

హిందీ బ్లాక్ బస్టర్ ‘సాలా ఖడూస్’ రీమేక్ తో బ్లాక్ బస్టర్ ని బ్యాగ్ లో వేసుకున్న వెంకటేష్, మరి ప్రియదర్శన్ తో స్ట్రేట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడా..? లేక ఏదైనా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడా..? ఈ క్వశ్చన్స్ కి క్లారిటీ రావాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.