Narappa - వెంకీ సినిమా షూట్ కంప్లీట్

Monday,February 01,2021 - 03:58 by Z_CLU

వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమా షూటింగ్ పూర్తయింది. ఇవాళ్టితో నారప్ప టోటల్ షూట్ పూర్తయినట్టు నిర్మాత సురేష్ బాబు ఎనౌన్స్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ రీమేక్ సినిమా.

సినిమాలో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో నారప్ప గా వెంకటేశ్, సుందరమ్మగా ప్రియమణి కనిపించబోతున్నారు. వీళ్లకు కొడుకు పాత్రలో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం కనిపించబోతున్నాడు.

తమిళంలో సూపర్ హిట్టయిన అసురన్ సినిమాకు రీమేక్ గా వస్తోంది నారప్ప. తెలుగులో ఈ మూవీని డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను కలిసి నిర్మిస్తున్నారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

మూవీకి సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా మే 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది నారప్ప మూవీ.

Also Check – నారప్ప గ్లింప్స్