'వెంకీ మామ' మూవీ అప్డేట్స్

Sunday,October 28,2018 - 10:02 by Z_CLU

విక్టరి వెంకటేష్ , యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘వెంకీ మామ’ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకొని సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇటివలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా నవంబర్ రెండో వారం నుండి సెట్స్ పైకి రానుంది. ప్రెజెంట్ f2 సినిమాతో వెంకీ ,సవ్యసాచి ప్రమోషన్స్ , శివ నిర్వాణ సినిమాతో చైతూ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్ నుండి మామ అల్లుడు ఈ సినిమా సెట్స్ లో పాల్గొననున్నారు .

బాబి డైరెక్షన్ లో ఫుల్లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,కోనా ఫిలిం కార్పో రేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.