జూలై నుండి వెంకీ చైతుల మల్టీస్టారర్..?

Sunday,June 10,2018 - 06:16 by Z_CLU

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సీజన్ నడుస్తుంది.  అయితే వాటిలో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యల సినిమా కూడా ఉంది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఈ రియల్ లైఫ్ మామా, అల్లుళ్ళు రీల్ లైఫ్ లోను మామా, అల్లుళ్ళుగా మెస్మరైజ్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా మ్యాగ్జిమం జూలై కల్లా సెట్స్ పైకి వచ్చే  అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో నటించనున్న మెయిన్ కాస్ట్ తో పాటు టెక్నికల్ టీమ్  ని ఫిక్స్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్,  భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రెజెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన  హుమా ఖురేషిని, చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని ఫిక్స్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్ ఈ మ్యాజికల్ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. మరో వైపు నాగచైతన్య’సవ్యసాచి’ సినిమాతో పాటు మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో పాసిబుల్ డేట్స్ ని బట్టి ఈ సినిమా  షెడ్యూల్స్ ని డిజైన్ చేసుకుంటున్న  సినిమా యూనిట్, త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేయనుంది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు సురేష్ బాబు, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.