ఫస్ట్ సేఫ్టీ..నెక్ట్స్ షూటింగ్

Wednesday,June 03,2020 - 05:42 by Z_CLU

తెలంగాణలో షూటింగ్స్ కు పర్మిషన్ వచ్చేసింది. అయితే యూనిట్స్ అన్నీ సెట్స్ పైకి వెళ్లడం లేదు. కొందరు మాత్రం ఈ విషయంలో ఆలోచనలో పడ్డారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి ఓ మంచి సందేశం ఇచ్చారు సీనియర్ హీరో వెంకటేశ్.

“70 రోజులుగా కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషికి నా ధన్యవాదాలు. కరోనా పోరులో సేవలందించిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పడం తక్కువే అవుతుంది. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నుంచి అన్నీ తెరుచుకుంటున్నాయి. ఇలాంటి టైమ్ లో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి.”

ముందుగా సేఫ్టీకి ఇఁపార్టెన్స్ ఇవ్వాలని.. ఆ తర్వాతే దేనికైనా ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాడు వెంకటేశ్. అందరూ తప్పనిసరిగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కోరుతున్నారు.