వెంకీ మొదలెట్టాడు...

Monday,July 09,2018 - 11:34 by Z_CLU

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘F2’ ఇటివలే సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. వెంకటేష్,వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఈ షూటింగ్  లో జాయిన్ అయ్యాడు విక్టరీ వెంకటేష్.  ఈరోజు నుండి వెంకటేష్ గారితో వర్క్ చేయబోతున్నామంటూ  ఎగ్జైట్మెంట్ తో  ట్వీట్ చేసాడు అనిల్ రావిపూడి. అలాగే ఈ సినిమాలో వెంకీ గెటప్ ఎలా ఉండబోతుందో..కుడా ఓ ఫోటో ద్వారా చెప్పాడు. ‘గురు’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వెంకీ ఎట్టకేలకు ఈ సినిమాతో  కెమెరా ముందుకొచ్చాడు.

ఇప్పటికే వరుణ్ తేజ్ ,ఫ్రెండ్స్ కాంబినేషన్ లో కొన్ని సీన్స్ తీసిన యూనిట్ నేటి నుండి వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఇంపార్టెన్స్ సీన్స్ షూట్ చేయనున్నారు.

వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా  వరుణ్ తేజ్ సరసన మెహరీన్ జోడీ కట్టనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.