త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్

Tuesday,December 12,2017 - 07:03 by Z_CLU

విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా దగ్గుబాటి అభిమానులకు అదిరిపోయే న్యూస్. మాటల మాంత్రికుడు, స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు వెంకీ. హారిక-హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ (చినబాబు) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్-6గా ఆస్థాన దర్శకుడు త్రివిక్రమ్, వెంకీ కాంబోలో సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు.

గతంలో వెంకీ-త్రివిక్రమ్ కాంబోలో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి హిలేరియస్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ వర్కవుట్ అయింది. అయితే ఈ మూవీ కంటే ముందు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు త్రివిక్రమ్. అది కంప్లీట్ అయిన వెంటనే వెంకీతో సినిమా స్టార్ట్ అవుతుంది.

ఇటు వెంకటేష్ కూడా తేజ దర్శకత్వంలో మూవీకి రెడీ అవుతున్నాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ వెంటనే వెంకీ-త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వస్తుంది.