'రాజు గారి గది' ఫ్రాంచైజీలో వెంకీ !

Sunday,October 20,2019 - 01:03 by Z_CLU

విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ లిస్టులో తరుణ్ భాస్కర్ , త్రినాద్ రావు నక్కిన, అనీల్ రావిపూడి  లతో పాటు త్రివిక్రమ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ లిస్టులో దర్శకుడు ఓంకార్ కూడా చేరాడు. లేటెస్ట్ గా ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు ఓంకార్. ‘రాజు గారి గది 2’ వెంకటేష్ గారితో చేయాలనుకున్నానని కానీ కుదర్లేదని కానీ ఇప్పటికీ ఆయనతో సినిమా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వెంకటేష్ గారితో ‘రాజు గారి గది’ కి సంబంధించి ఓ సీక్వెల్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ‘వెంకీ మామ’ షూటింగ్ తో బిజీగా ఉన్న వెంకటేష్ నెక్స్ట్ తరుణ్ భాస్కర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మరి తరుణ్ భాస్కర్ తర్వాత వెంకీ ఓంకార్ కే ఛాన్స్ ఇస్తాడా..చూడాలి.