సంక్రాంతి నుండి ‘అజ్ఞాతవాసి’ లో వెంకటేష్

Friday,January 12,2018 - 01:58 by Z_CLU

ఈ నెల 10 న రిలీజయింది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. అటు ఓవర్ సీస్ లోను తెలుగు స్టేట్స్ లోను సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, రికార్డ్ బ్రేకింగ్ వసూళ్ళు బ్యాగ్ లో వేసుకుంటుంది. సంక్రాంతికి ముందే ఫ్యాన్స్ లో ఫెస్టివ్ సీజన్ బిగిన్ చేసిన ఈ సినిమాలో, సంక్రాంతి నుండి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చేయనుంది ‘అజ్ఞాతవాసి’ టీమ్.

‘అజ్ఞాతవాసి’ సినిమాలో వెంకటేష్ కామియో రోల్ లో కనిపించానున్నాడని సినిమా రిలీజ్ కి ముందే అనౌన్స్ చేసిన సినిమా యూనిట్, ఎగ్జాక్ట్ రీజన్ రివీల్ చేయలేదు కానీ, సినిమాలో మాత్రం జస్ట్ థాంక్స్ కార్డ్ తో సరిపెట్టేసింది. అయితే ఈ సంక్రాంతి నుండి సినిమాలో డిలీట్ చేసిన ఈ సీన్స్ ని ఆడ్ చేయనుంది సినిమా యూనిట్. దీనికి సంబంధించి ‘విక్టరీ వెంకటేష్  కామియో మేకింగ్’  వీడియోని కూడా రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

వెంకటేష్, పవన్ కళ్యాణ్ గతంలో ‘గోపాల గోపాల’ సినిమాలో కూడా ఫుల్ టైమ్ స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్న వెంకీ, ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘అజ్ఞాతవాసి’ కి మరింత క్రేజ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.