మరో సోషియో ఫాంటసీ మూవీ...

Thursday,December 08,2016 - 01:14 by Z_CLU

విక్టరీ వెంకటేష్ కు సోసియో ఫాంటసీ కథల్లో నటించడం కొత్తేంకాదు. గతంలో దేవీపుత్రుడు, సాహసవీరుడు-సాగరకన్య లాంటి సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు వెంకీ. ఇప్పుడీ హీరో మరోసారి ఆ జానర్ లో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వెంకీకి ఈ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన దర్శకుడు క్రిష్.

venkatesh-krish

ప్రస్తుతం బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్.. ఈమధ్యే వెంకీకీ ఈ స్టోరీలైన్ వినిపించాడట. తను ఒప్పుకుంటే స్క్రీన్ ప్లే డెవలప్ చేస్తానని చెప్పాడట. క్రిష్ చెప్పిన కథకు వెంకటేష్ వెంటనే ఒప్పుకున్నాడని టాక్.

ప్రస్తుతం గురు సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహాార్లు అనే సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత క్రిష్ మూవీపై ఓ క్లారిటీ వస్తుంది.