తెలుగు సినిమాకి కలిసొచ్చే వెంకీ

Wednesday,June 26,2019 - 01:01 by Z_CLU

వెంకటేష్ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయితెహ్ చాలు సినిమా సక్సెస్ గ్యారంటీ. ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా క్రియేట్ అయిన సెంటిమెంట్ ఇది. అందుకే ఈ సెంటిమెంట్ కి తగ్గట్టే వెంకీ చేతుల మీదుగా ‘బుర్రకథ’ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఊహించినట్టుగానే సోషల్ మీడియాలో సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

గతంలో ప్రీ రిలీజ్ కి అటెండ్ సినిమాలు వరసగా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకున్నవే. ‘మజిలీ’ నుండి బిగిన్ అయితే ‘మహర్షి’ వరకు అన్ని సినిమాలు వెంకీ ని లక్కీ చార్మ్ గా ప్రూఫ్ చేసినవే. అందుకే ఇప్పుడు ‘బుర్రకథ’ కూడా ఈ వరసలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

వెంకీ హీరోగా నటించాడంటే సినిమా మినిమం గ్యారంటీ. అలాంటిది ఇప్పుడు వెంకీ హ్యాండ్ తగిలినా చాలు బాక్సాఫీస్ కంట్రోల్ లోకి వచ్చేస్తుందనిపిస్తుంది. న్యాచురల్ గానే ఎప్పుడూ పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఉండే వెంకీ ఇలా ఏ సినిమాని ఎంకరేజ్ చేసే అవకాశం దొరికినా అస్సలు వదులుకోవడం లేదు…

ఈ లెక్కన ‘బుర్రకథ’ కూడా ఎక్స్ పెక్ట్ చేసిన సక్సెస్ అందుకుంటే అనుమానం లేదు… విక్టరీ వెంకటేష్ సెట్స్ పై ఎంత బిజీగా ఉంటున్నాడో… ఇకపై ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ తో కూడా అంతే బిజీ అయిపోతాడు.