‘అసురన్’ తెలుగు రీమేక్ లో వెంకటేష్

Friday,October 25,2019 - 06:12 by Z_CLU

ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది అసురన్ చిత్రం.

ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. అసురన్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ దగ్గుబాటి హీరో వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అసురన్ రీమేక్‌లో నటించనున్నారు.

తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తారు