Venkatesh - అన్నీ వండుతున్నారు

Thursday,November 18,2021 - 03:39 by Z_CLU

Venkatesh Daggubati gives clarity on Next Films

హీరో వెంకటేష్ వరుసగా సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచేశాడు. ఇటివలే ‘నారప్ప’ తో OTT ఆడియన్స్ ని  మెప్పించిన వెంకీ ఇప్పుడు ‘దృశ్యం 2’ తో రాబోతున్నాడు. అలాగే ‘F3’ షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకుంది. అయితే ఇకపై నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా వెంకీ ఇదే స్పీడ్ మైంటైన్ చేస్తారా ? అంటే దానికి వెంకీ దగ్గర సమాధానం లేదనే చెప్పాలి. అవును తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి అడిగితే వెంకీ అదే రీతిలో స్పందించాడు.

” నెక్స్ట్ ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు. కథలు వండుతున్నారు. పిలిచి రెడీ అయిందా ?  అంటే లేదు ఇంకా ఏదో వేయాలి అంటూ ఆన్సర్ ఇస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా కథ రెడీ చేస్తున్నాడు. ఒకసారి కథ రెడీ అయి ఫిక్స్ అయితే వెంటనే ఎనౌన్స్ చేస్తాను. ” అంటూ చెప్పుకున్నాడు వెంకటేష్.

అంటే వెంకీ లిస్టులో నెక్స్ట్ కొన్ని కథలున్నాయి. కానీ వాటిలో ఏది ఫైనల్ అవ్వలేదు. అన్నీ స్క్రిప్టింగ్ స్టేజిలోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం రానాతో కలిసి ఒక OTT సంస్థ కోసం ‘రానా నాయుడు‘ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు వెంకీ. అందులో డిఫరెంట్ లుక్ లో కొత్త క్యారెక్టర్ తో కనిపించనున్నాడు. ‘F3’ తర్వాత వెంకీ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదొక్కటే. సిరీస్ షూట్ అయ్యేలోపు లిస్టు లో ఉన్న ఏదో ఒక కథ రెడీ అవుతుంది. అప్పుడు ఆ సినిమాతో సెట్స్ పైకి వెళ్తాడు వెంకీ. మరి వెంకటేష్ నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ ఎప్పుడు బయటికొస్తాయో చూడాలి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘దృశ్యం 2’ ఈ నెల 25న OTT లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics