వరుణ్ తేజ్ ని మహేష్ బాబుతో పోల్చిన వెంకీ

Monday,December 31,2018 - 01:03 by Z_CLU

వరుణ్ తేజ్ ని మహేష్ బాబు తో కంపేర్ చేశాడు వెంకటేష్. నిన్న వైజాగ్  లో జరిగిన ‘F2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తరవాత మహేష్ బాబు నాకు  సొంత బ్రదర్  కన్నా ఎక్కువగా దగ్గరయ్యాడు. ఇప్పుడు ‘F2’ చేసిన తరవాత వరుణ్ తేజ్ తో కూడా అలాంటి అనుబంధమే ఏర్పడింది’ అని చెప్పుకున్నాడు వెంకీ.

వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. తన ఇన్నాళ్ళ కరియర్ లో ఇప్పటి వరకు తను చేసిన క్యారెక్టర్స్ వేరు, ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ వేరు. మీ అందరికీ నచ్చడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా  చెప్పుకున్నాడు ఈ మెగా హీరో.

మోస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది F2. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ సినిమాపై చాలా అంచనాలను పెంచేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి గత సినిమాల సక్సెస్ ఇంపాక్ట్ ఈ సినిమాపై భారీగా కనిపిస్తుంది. దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్. DSP మ్యూజిక్ కంపోజర్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్స్ లోకి రానుంది F2.