Venkatesh ఫ్యాన్స్ కి పండగే !

Monday,February 01,2021 - 03:21 by Z_CLU

‘F2’ రిలీజై రెండేళ్లవుతుంది. ఇప్పటి వరకు వెంకటేష్ నుండి సినిమా రాలేదు. దీని బట్టి చూస్తే వెంకీ రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నట్టే. ఇప్పుడా గ్యాప్ మర్చిపోయేలా రెండు సినిమాలతో ప్రేక్షకులకు బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్ మెంట్ అందించడానికి రెడీ అవుతున్నాడు. అవును ఈ ఏడాది ఈ సీనియర్ హీరో నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ‘నారప్ప‘ కాగా మరొకటి ‘F3‘.

ఈ రెండు సినిమాలకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. ‘నారప్ప’ మే 14న థియేటర్స్ లోకి వస్తుండగా వెంకటేష్ -వరుణ్ కాంబోలో వస్తున్న ‘F3’ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే జస్ట్ నాలుగు నెలల్లోనే ఈ రెండు సినిమాలతో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు వెంకీ. ఈ రెండూ చెరో జోనర్ లో తెరకెక్కుతున్నాయి. రివేంజ్ యాక్షన్ కాన్సెప్ట్ తో ‘అసురన్’  తమిళ్ సినిమాకు రీమేక్ గా  ‘నారప్ప’ రూపొందుతుండగా  ‘F3’ ఫన్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ‘నారప్ప’గా మాస్ గెటప్ లో ఎట్రాక్ట్ చేస్తున్న వెంకీ అటు F3 లో క్లీన్ షేవ్ తో ఫ్యామిలీ మెన్ గా కనిపిస్తూ మళ్ళీ తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేయడానికి సిద్దమవుతున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో విక్టరి ఎలాంటి విజయాలు  అందుకుంటాడో వేచి చూడాలి.