పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ లో వెంకటేష్ క్యారెక్టర్

Tuesday,December 26,2017 - 05:30 by Z_CLU

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాలో వెంకటేష్ కామియో రోల్ లో మెస్మరైజ్ చేయనున్నాడనే న్యూస్, అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు, ఇటు వెంకటేష్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపేసింది. అయితే వెంకీ ప్లే చేస్తున్న క్యారెక్టర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు టాలీవుడ్ లో మరింత హీట్ ని జెనెరేట్ చేస్తుంది.

ఈ సినిమాలో వెంకీ ప్లే చేస్తుంది జస్ట్ కామియో రోల్ కాదు, సినిమాపై హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే కీ రోల్ అని తెలుస్తుంది. ఈ విషయంలో సినిమా యూనిట్ నుండి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు కానీ, ఈ క్యారెక్టర్ కోసం దాదాపు 10 రోజుల రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్నాడట వెంకీ.

త్రివిక్రమ్ మార్క్ ఇమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఖుష్బూ కూడా మరో కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ నటించిన ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.