'వెంకటేష్' బర్త్ డే స్పెషల్
Wednesday,December 13,2017 - 09:05 by Z_CLU
క్యారెక్టర్ ఎలాంటిదైనా కథలో దమ్ముంటే, సంతకం చేసేస్తాడు అందుకే ఐదు పదుల వయసులోనూ టాలీవుడ్ కి వన్ అండ్ ఓన్లీ విక్టరీ “వెంకటేష్ దగ్గుబాటి”. డిసెంబర్ 13, 1960 లో పుట్టిన టాలీవుడ్ ‘గురు’ ఈ రోజు తన 55 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు.

‘కలియుగ పాండవులు’ తో తెరంగేట్రం చేసిన వెంకటేష్ మొదటి సినిమాతోనే ఆడియెన్స్ లో తఃనకంటూ మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమాకే బెస్ట్ డెబ్యూ యాక్టర్ క్యాటగిరీలో నంది అవార్డు దక్కించుకున్నాడు వెంకీ.

మొదటి సినిమా సక్సెస్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకు పోతున్న వెంకీ కరియర్ లో ‘స్వర్ణ కమలం’ సరైన టైం లో పడి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వెంకీ కరియర్ ని ఏకంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది.

వెంకటేష్ కి అన్ లిమిటెడ్ స్టార్ డం ని సంపాదించి పెట్టిన ‘బొబ్బిలి రాజా’ వెంకీ కరియర్ విషయంలోనే కాదు, సినిమా అభిమానుల్లోనూ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అల్టిమేట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన బొబ్బిలి రాజా, ఫ్యూచర్ జెనెరేషన్స్ కి కూడా వన్ ఆఫ్ ది ఫేవరేట్ సినిమా క్యాటగిరీ లో ఉంటుంది.

వెంకటేష్ తన కరియర్ లో చాలామంది హీరోయిన్స్ తో జత కట్టాడు. ఆల్ టైం హిట్ పెయిర్ గా నిలిచింది మాత్రం వెంకటేష్ సౌందర్య కాంబి నేషనే. తన కరియర్ లో ఎంత మంది హీరోయిన్స్ తో జత కట్టినా, ఈ ఇద్దరి కాంబో అల్టిమేట్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసేది.

ఇన్నోసెంట్ యంగ్ మ్యాన్ గా కన్పిస్తూనే , గంభీరంగా ఉండే ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ లో నటించి సూర్య వంశం సినిమాలో 100 కి 100 మార్కులు కొట్టేశాడు వెంకీ. మ్యాగ్జిమం అన్ని రకాల ఆడియెన్స్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా వెంకీ కరియర్ లో బెస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది.

సినిమా హీరో అంటేనే అల్టిమేట్ మ్యానరిజం, యాక్షన్, ఇంటెలిజెన్సీ… ఇలాంటి రొటీన్ ఫ్లేవర్స్ కి బ్రేక్ వేస్తూ, ఇన్నోసెంట్ క్యారెక్టర్ తో ‘చంటి’ సినిమా విషయంలో పెద్ద సాహసమే చేశాడు వెంకటేష్. ఈ సూపర్ హిట్ ఎంటర్ టైనర్ లో తన పర్ఫార్మెన్స్ తో క్రిటిక్స్ చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు వెంకీ.

వెంకటేష్ కరియర్ లో ఫ్యామిలే హిట్స్ చాలానే ఉన్నా, అందులో ‘సుందర కాండ’,’కలిసుందాం రా’,’నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు వెంకీకే కాదు, వెంకీ ఫ్యాన్స్ కి కూడా సో స్పెషల్.

రొటీన్ పర్ఫామెన్స్ తో ఎపుడూ బోర్ కొట్టించలేదు వెంకటేష్. అప్పుడప్పుడు మాస్ మసాలా ఎలిమెంట్స్ తో, యాక్షన్ హీరోగా కూడా సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. క్షణ క్షణం, లక్ష్మి, తులసి, ధర్మచక్రం సినిమాలు వెంకీ లోని ఇన్ సైడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎలివేట్ చేశాయి.

వెంకటేష్ కరియర్ లో ది మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ లో డి.సి.పి రామ చంద్ర. ఈ క్యారెక్టర్ తో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మెస్మరైజ్ చేసాడు వెంకీ. ఈ సినిమాలో వెంకీ హీరోయిజం పీక్స్.

ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో జనవరి నుండి సెట్స్ పై రానున్న వెంకీ, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని నిన్న అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను రాధాకృష్ణ హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.
సినిమా సినిమాకి కరియర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతూ, ఒక్కో సంవత్సరం క్రాస్ చేసినప్పుడల్లా మరింత యంగ్ లుక్ తో, డైనమిక్ మ్యానరిజంతో సరికొత్తగా అలరించే విక్టరీ వెంకటేష్ కి బర్త్ డే విషెస్ తెలుపుతుంది జీ సినిమాలు.