సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ అదే ?

Saturday,June 30,2018 - 10:47 by Z_CLU

‘గురు’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేస్తూ స్పీడ్ పెంచేసాడు. వరుణ్ తేజ్ తో కలిసి ‘F2’ సినిమా చేస్తున్న వెంకీ మరో వైపు నాగ చైతన్య తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు లేటెస్ట్ గా  మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విక్టరీ. త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ -స్క్రీన్ ప్లే -మాటలు  అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ ఓ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. అసలు ఈ సినిమాకి వెంకీ ఓకే చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా క్యారెక్టరే అని సమాచారం. సో ఇప్పటికే పోలిస్ గా ఎన్నో సినిమాలు చేసిన వెంకటేష్ ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టరైజేషన్ తో మెప్పిస్తాడో…చూడాలి.