ఒకే వేదిక పైకి నాని, వెంకీ

Sunday,April 14,2019 - 10:39 by Z_CLU

నాని లేటెస్ట్ మూవీ జెర్సీ. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రేపు శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగబోతోంది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నాడు.

తెలుగులో ఎమోషనల్ మూవీస్ కు పెట్టింది పేరు వెంకటేష్. ఇప్పుడు నాని చేస్తున్న జెర్సీ కూడా ఎమోషనల్ మూవీనే. పైగా నాని ఫేవరెట్ హీరో కూడా వెంకటేశ్. సో.. జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వెంకటేశ్ రావడం అన్ని విధాల కరెక్ట్.

నాని, శ్రద్ధా శ్రీనాధ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈనెల 19న థియేటర్లలోకి రానుంది జెర్సీ.