అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ మరో సినిమా

Thursday,January 10,2019 - 03:24 by Z_CLU

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ‘F2’ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కి అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ వస్తుంది. హ్యూమర్ జెనెరేట్ చేయడంలో అనిల్ రావిపూడి కి మంచి స్పార్క్ ఉందని రీసెంట్ గా మీడియా ఇంటరాక్షన్ లో చెప్పుకున్న వెంకీ, త్వరలో మళ్ళీ ఈ డైరెక్టర్ తోనే సెట్స్ పైకి రానున్నాడు. అయితే ఈ సారి సోలో హీరోగా.

‘F2’ సినిమా సెట్స్ పై ఉండగానే అవకాశం చూసుకుని, మైండ్ లో ఉన్న ఇంకో స్టోరీలైన్ ని వెంకటేష్ కి న్యారేట్ చేశాడట అనిల్ రావిపూడి. దానికి ఇంప్రెస్ అయిన వెంకీ అక్కడికక్కడే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావాలంటే కొంచెం టైమ్ పట్టే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ‘F2’ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న వెంకటేష్, ఈ హడావిడి సద్దుమణిగాక ఇమ్మీడియట్ గా ‘వెంకీమామ’ సినిమా చేస్తాడు. ఈ లోపు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా సంగతి ఎప్పుడనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి సినిమా ఎగ్జాక్ట్ స్టేటస్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.