మరో మల్టీస్టారర్ మొదలైంది

Wednesday,July 11,2018 - 01:16 by Z_CLU

వెంకటేష్, నాగచైతన్యల మల్టీస్టారర్ ఈ రోజే గ్రాండ్ గా లాంచ్ అయింది. బాబీ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమాలో రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు, రీల్ లైఫ్ లోను మామా-అల్లుళ్ళలా ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు ”వెంకీ మామ” అనే టైటిల్ అనుకుంటున్నారు.

గతంలో నాగ చైతన్య ‘ప్రేమమ్’ లో కామియో రోల్ లో కనిపించాడు వెంకీ. ఆ కొద్దిపాటి అప్పియరెన్స్ కే ఫ్యాన్స్ మెస్మరైజ్ అయిపోయారు. ఇప్పుడు అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మ్యాగ్జిమం స్పేస్ లో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ మామాఅల్లుళ్ళు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి రాబోతోంది వెంకీ మామ సినిమా. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమాను విడుదల చేస్తారు. జై లవకుశ తర్వాత బాబి హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్టు ఇదే. హీరోయిన్స్ ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు.